Ultimate magazine theme for WordPress.

బిగ్‌బాస్ సెకండ్ సీజ‌న్‌ 2 లిస్ట్ నుండి శ్రీరెడ్డి ఎందుకు అవుట్ అయ్యేంది ? కార‌ణాలు ఇవే..!

0

వివాదాల శ్రీరెడ్డి త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో బిగ్‌బాస్‌ గురించి పోస్టు పెడుతూ.. నా స్నేహితులకు చేదువార్త… ఇది నా దురదృష్టం… బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదు. హౌస్‌లో నేనుంటానని ఊహించకండి. కొందరికి చాలా సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు. కొందరు అప్‌సెట్‌ అవ్వొచ్చు. పోటీదారులు చాలా అదృష్టవంతులు. బిగ్‌బాస్‌ బృందానికి ఆల్‌ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేసింది.

అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బిగ్‌బాస్ -2 సీజ‌న్‌లో శ్రీరెడ్డి క‌చ్ఛితంగా ఉంటుంద‌ని అంద‌రూ ఊహించారు. అస‌లే కాంట్ర‌వ‌ర్సిటీల‌కు మారు పేరైన బిగ్‌బాస్‌లో శ్రీరెడ్డి లాంటి వాళ్లు ఉంటే.. మ‌సాలా బాగా ఉంటుంద‌ని స‌ర్వ‌త్రా భావించారు. తీరా చూస్తే తాను బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయ‌డంలేద‌ని త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి అంద‌రికీ షాక్ ఇచ్చింది శ్రీరెడ్డి. ఇక ఈ ఆదివారం స్టార్ట్ కానున్న‌ బిగ్‌బాస్‌ సీజన్-2 దాదాపు వంద రోజులపాటు 16 మంది సెలబ్రిటీలు బిగ్‌బాస్‌ హౌస్‌లో ర‌చ్చ చేయ‌నున్నారు. అయితే శ్రీరెడ్డి బిగ్‌బాస్‌లో మిస్ అవ‌డానికి కార‌ణాలు ఏంట‌ని ఆరా తీయ‌గా.. గ‌త కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటుల పై, దర్శక నిర్మాతల పై.. క‌నివినీ ఎరుగ‌ని రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు ఇక్కడ ఛాన్స్ దొరకలేదని.. సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.